News April 10, 2025

భట్టిప్రోలు: మద్యం మత్తులో తల్లిని హతమార్చిన తనయుడు

image

మద్యం మత్తులో కన్నతల్లిని కడతేర్చినట్లు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఎస్ఐ ఎం శివయ్య బుధవారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. భట్టిప్రోలుకు చెందిన బసవపూర్ణమ్మ(74) పెద్ద కుమారుడు దుర్గారావు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం అతను తల్లిని దూషిస్తూ, డబ్బుల కోసం వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఆమె డబ్బులు ఇవ్వకపోవటంతో తల్లిని హతమార్చాడన్నారు. వేమూరు సీఐ వీరాంజనేయులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

Similar News

News September 18, 2025

గ్రౌండ్‌లోకి రాని పాక్ టీమ్.. అంపైర్లు ఏం చేశారో తెలుసా?

image

2006 AUG 20న ఇంగ్లండ్‌తో టెస్టులో <<17707677>>పాకిస్థాన్<<>> బాల్‌ట్యాంపరింగ్ చేసిందని అంపైర్లు గుర్తించి ఇంగ్లిష్ జట్టుకు 5రన్స్ పెనాల్టీ కింద ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పాక్ ఆటగాళ్లు టీ బ్రేక్ తర్వాత మైదానంలోకి వచ్చేందుకు నిరాకరించారు. పాకిస్థాన్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చినా వాళ్లు గ్రౌండ్‌లోకి రాలేదు. దీంతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన అంపైర్లు బెయిల్స్ తీసేసి ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు.

News September 18, 2025

‘తెలంగాణ చరిత్ర తెలియాలంటే సూర్యాపేటకు రండి’

image

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారని బృందాకారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోరాట వారోత్సవాల సెమినార్‌లో ఆమె మాట్లాడారు. సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చూపిస్తున్నారన్నారు. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాలకు తెలంగాణ చరిత్ర తెలియాలంటే సూర్యాపేటకు వచ్చి చూడాలని ఆమె సవాల్ విసిరారు. చరిత్రను వక్రీకరించడం మానుకోవాలని హెచ్చరించారు.

News September 18, 2025

అంధుల పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక

image

ఖమ్మం జిల్లాలో అంధుల కోసం పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంధుల స్కూల్‌ ఏర్పాటుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డా.పి.శ్రీజ, జడ్పీ సీఈఓ, విద్యాశాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.