News March 27, 2024

రంగంలోకి దిగనున్న ముగ్గురు అధినేతలు

image

AP: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. ప్రధాన పార్టీల అధినేతలు ప్రచార రంగంలోకి దిగనున్నారు. నేటి నుంచి ‘మేమంతా సిద్ధం’ యాత్రకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ సమాధి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 21 రోజుల పాటు సాగనుంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి ‘ప్రజాగళం’ పేరిట ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ నెల 30నుంచి జనసేనాని పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తారు.

Similar News

News January 20, 2026

రేపు మట్టపల్లికి గవర్నర్ రాక..

image

మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌, ఎస్పీ నరసింహతో కలిసి హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రోటోకాల్ పాటిస్తూనే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆలయ పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు.

News January 20, 2026

తినేటప్పుడు మాట్లాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా!

image

ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడితే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి ద్వారా అధికంగా గాలి పొట్టలోకి చేరి తేన్పులు, గ్యాస్ సమస్యలు రావొచ్చు. ఒక్కోసారి అన్నవాహికలోకి కాకుండా గాలి వెళ్లే గొట్టంలోకి ఆహారం వెళ్లి గొంతునొప్పి, తీవ్రమైన దగ్గు వస్తుంది. ఎక్కువగా తినడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. సరిగ్గా నమలకపోవడంతో జీర్ణరసాలు ఆహారంలో కలవక అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.

News January 20, 2026

స్థలం చిన్నదైనా ఇంకుడు గుంత తవ్వాలా?

image

స్థలం చిన్నదైనా వాస్తు నియమాలు పాటిస్తూ కనీస సౌకర్యాలు కల్పించుకోవడం సాధ్యమే అంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. నీటి వసతి కోసం నిర్మించే సంపు, ఇంకుడు గుంతలను ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. ‘అవసరమైతే గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యమైన నిర్మాణానికి ఆటంకం కలగకుండా, ఉన్న స్థలంలోనే శాస్త్రీయంగా వీటిని నిర్మించుకోవడం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>