News April 10, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,00,715 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. టికెట్లు అమ్మకం ద్వారా రూ.38,166, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.55,815, అన్నదానానికి రూ.6,734 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News September 18, 2025
NTR: రూ.42 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు సింగ్‌నగర్‌కు చెందిన వృద్ధుడిని మోసం చేశారు. ఈ నెల 11న సైబర్ నేరగాళ్లు సత్యనారాయణ మూర్తికి ఫోన్ చేసి భయపెట్టారు. ఈ క్రమంలో అతని బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా రూ.42 లక్షలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News September 18, 2025
చేతిలో బిట్ కాయిన్‌తో ట్రంప్ విగ్రహం

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్‌తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.
News September 18, 2025
NLG: ఆర్టీసీలో ‘యాత్రా దానం’.. దాతలు ముందుకు వచ్చేనా?

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు తీర్థయాత్రల కోసం ప్రయాణికులకు బస్సు సదుపాయాలు కల్పించిన ఆర్టీసీ ప్రస్తుతం ‘యాత్రా దానం’ పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు పేద, వృద్ధులు, దివ్యాంగుల తీర్థయాత్రలకు బస్సు సర్వీసులు నడపనుంది. దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.