News April 10, 2025

గృహనిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో గృహనిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. రాయచోటి కలెక్టరేట్‌లో డిఈలు, ఏఈలు, మండల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. పేదలందరికీ సొంతింటి కల సాకారం చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ మేరకు అదనపు ఆర్థిక సహాయం కూడా అందిస్తోందన్నారు.

Similar News

News January 14, 2026

బుల్లెట్ బండిని గెలుచుకున్న గుంటూరు కోడి పుంజు

image

కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడిపందేలలో రాజధాని ప్రాంతం నుంచి తుళ్లూరుకి చెందిన కోడి పుంజు పందెంలో నెగ్గింది. దీంతో నిర్వాహకులు వారికి బుల్లెట్ బండిని బహుమతిగా అందజేశారు. బుల్లెట్ వాహనం ఖరీదు సుమారు రూ.2.50 లక్షల పైన ఉంటుందని చెబుతున్నారు. పందేలను వీక్షించేందుకు భారీగా జనం గుమిగూడారు.

News January 14, 2026

NRPT: సంక్రాంతి పండగ పూట విషాదం..

image

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నేతాజీ (36) దుర్మరణం చెందారు. మక్తల్ నుంచి రాయచూర్ వెళ్తున్న లారీ, అదే మార్గంలో వెళ్తున్న బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నేతాజీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్సై నవీద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పండుగ పూట ఈ ప్రమాదం విషాదం నింపింది.

News January 14, 2026

KNR: సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత

image

కరీంనగర్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శాపంగా మారింది. రెగ్యులర్ అధికారులు లేక జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నారు. తిమ్మాపూర్ వంటి చోట్ల 3 నెలల్లోనే నలుగురు అధికారులు మారడం గమనార్హం. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, తగిన అవగాహన లేక దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని క్రయవిక్రయదారులు వాపోతున్నారు.