News April 10, 2025

మందమర్రి: పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: MP, MLA

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రజలకు వసతి హక్కు కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి మండలం పొన్నారంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అర్హులైన పేదలందరికీ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు.

Similar News

News July 6, 2025

నిర్మల్ జిల్లాకు భారీ వర్ష సూచన

image

నిర్మల్ జిల్లాలో ఈనెల 6 నుంచి 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈనేపథ్యంలో జిల్లాకు పింక్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు.

News July 6, 2025

‘విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో కొత్త బ్యారక్’

image

ఏపీలో ఉన్న వివిధ జైళ్లను రూ.103 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు జైళ్ల శాఖ ఐజీ డా.ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. దీనికి సంబంధించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసిన డిజైన్‌ను అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించామన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో రూ.10 కోట్లతో 250 మంది సామర్థ్యం గల కొత్త బ్యారక్ నిర్మాణం జరుగుతుందన్నారు. విశాఖ జైలుని సందర్శించిన ఆయన ఈ మేరకు వివరాలు తెలియజేశారు.

News July 6, 2025

వేంపల్లి: ట్రాక్టర్ ఢీ.. 50 గొర్రెలు మృతి

image

కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి- తాళ్లపల్లి మధ్యలో ట్రాక్టర్ ఢీకొని 50 గారెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ గొర్రెలు తాటిమాకులపల్లె ఎస్సీ కాలనీకి చెందిన వారివిగా గుర్తించారు. వీరంతా తాళ్లపల్లిలో మేపుకోసం వెళ్తున్నారు. అటుగా స్పీడుగా వచ్చిన ట్రాక్టర్ గొర్రెలను ఢీకొనగా అక్కడికక్కడే 50 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.