News April 10, 2025
సిద్దిపేట: స్టాక్ రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయాలి: కలెక్టర్

గురుకులాల్లో కొత్త డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. బుధవారం హబ్సిపూర్ మహాత్మ జ్యోతిబాపూలే, తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. స్టోర్ గదిని పరిశీలించి నాణ్యమైన సరుకులు మాత్రమే వాడాలని సూచించారు. ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News September 17, 2025
తెలంగాణ విమోచనంలో ఉమ్మడి KNR జిల్లా యోధులు

TG సాయుధ పోరాటంలో ఉమ్మడిKNR జిల్లా వీరులది కీలకపాత్ర. నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటానికి వీరులగడ్డ కేంద్రంగా నిలిచింది. అనభేరి ప్రభాకర్ రావు, బద్దం ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, సింగిరెడ్డి అంజిరెడ్డి, బోయినపల్లి వెంకటరావు, దేశిని చిన్నమల్లయ్య లాంటి ఎందరో యోధులు నిజాం నిరంకుషత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. TG సాయుధ పోరాటం వంటి ఉద్యమాల్లో పాల్గొని నిజాంకు సవాలు విసిరారు.
News September 17, 2025
ఆపరేషన్ పోలో కోదాడ నుంచే ప్రారంభం

ఉమ్మడి నల్గొండ జిల్లా పోరాటాలకు పురిటిగడ్డ. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల ఆగడాలను జిల్లా ప్రజలు ఎదురొడ్డి పోరాడారు. ఈ క్రమంలో నిజాం నవాబు పాలనలో బానిసత్వంలో మగ్గిన హైదరాబాద్ రాష్ట్ర ప్రజలను ఆపరేషన్ పోలో విముక్తుల్ని చేసింది. అయితే యూనియన్ సైన్యం మొదట అడుగుపెట్టింది మాత్రం కోదాడలోనే. అక్కడి నుంచే HYDకు జైత్రయాత్ర సాగించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న నిజాం తలొగ్గారు.
News September 17, 2025
ఆంధ్ర మహాసభకు ఆద్యుడు అనభేరి ప్రభాకర్ రావు

KNR జిల్లాకు చెందిన <<17731448>>అనభేరి<<>> ప్రభాకర్ రావు వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ, తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారు. నిజాం నిరంకుశ పాలనపై విసిరిన సవాలుగా ఆయన పోరాటం నిలిచిపోయింది. KNR జిల్లాలో ఆంధ్ర మహాసభ స్థాపించి, ప్రజలను చైతన్య పరిచి, TG విమోచన పోరాటానికి నాయకత్వం వహించారు. ప్రజల హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయం. ఈ రోజు ఆ మహనీయుని సేవలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.