News April 10, 2025
మెదక్: 11న పూలే జయంతి: కలెక్టర్

మహిళలు, బలహీనవర్గాల విద్యాభివృద్ధి రూపకర్త, సమ సమాజ స్థాపనకు స్ఫూర్తిదాత, మానవ హక్కుల అవిశ్రాంత యోధుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఈ నెల 11న అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 11న ఉదయం 10:30 గంటలకు ధ్యాన్ చంద్ చౌరస్తాలో గల జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల అనంతరం కలెక్టరేట్లో కార్యక్రమం ఉంటుందన్నారు.
Similar News
News October 28, 2025
మెదక్ జిల్లాకు కొత్తగా ఏడుగురు ఎంపీడీవోలు

మెదక్ జిల్లాకు కొత్తగా ఏడుగురు ఎంపీడీవోలు నియామకం అయ్యారు. జెడ్పీలో రిపోర్ట్ చేసిన అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిశారు. కొత్తగా కేటాయించిన వారు ఎంపీడీఓలుగా తూప్రాన్-శాలిక తేలు, నార్సింగి-ప్రీతి రెడ్డి, హవేలీఘన్పూర్-
వలుస శ్రేయంత్, చిలిపిచేడ్- బానోత్ ప్రవీణ్, అల్లాదుర్గ్- వేద ప్రకాశ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సీఈఓ ఎల్లయ్య ఉన్నారు.
News October 28, 2025
ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఐఈఓ మాధవి

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి(డీఐఈఓ) మాధవి సూచించారు. సోమవారం ఆమె వెల్దుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, తరగతి గదులను పరిశీలించారు. ఫిబ్రవరిలో జరగనున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకొని సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.
News October 28, 2025
అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది: అదనపు ఎస్పీ

విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని, వారి సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. రేగోడు పోలీసుల ఆధ్వర్యంలో పోచారం గ్రామానికి చెందిన అమరవీరుడు హెడ్ కానిస్టేబుల్ రాములు ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాములు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


