News April 10, 2025

ధర్మవరం: ‘YS జగన్ క్షమాపణలు చెప్పాలి’

image

YS జగన్ చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఖండించారు. బుధవారం ధర్మవరంలోని ఎన్జీ హోమ్‌లో వారు మాట్లాడుతూ.. వేలాది మంది కార్యకర్తలతో రాజకీయ సభలను తలపించే విధంగా తరలి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు 1200 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టామన్నారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలన్నారు. ఈ వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు.

Similar News

News July 6, 2025

తిర్యాణి: పశువుల మందపై పెద్దపులి దాడి?

image

తిర్యాణి మండలం ఎదులపాడు శివారులోని అటవీ ప్రాంతంలో పశువుల మందపై పెద్దపులి దాడి చేసిందని పశువుల కాపరులు తెలిపారు. పశువులను మేతకోసం అడవిలోకి తీసుకెళ్లగా వాటిపై ఒక్కసారిగా దాడి చేసిందని వెల్లడించారు. ఈ క్రమంలో తాము గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయిందని పేర్కొన్నారు. ఎదులపాడు, ఎగిండి అటవీ ప్రాంతంలో ఒంటరిగా ఎవరు వెళ్లొద్దని కాపరులు సూచిస్తున్నారు. పులి సంచారంపై అధికారులు క్లారిటీ ఇవాల్సి ఉంది.

News July 6, 2025

రేపటి నుంచి 8 గంటల ముందే..

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రిజర్వేషన్ ఛార్టుల ప్రిపరేషన్‌లో కొత్త విధానం జులై 7 నుంచి అమలు కానుంది. ఇప్పటివరకు రైలు బయల్దేరడానికి 4 గంటల ముందే ఛార్జ్ ప్రిపేర్ అవుతుండగా, రేపటి నుంచి 8 గంటల ముందే ఛార్ట్ ప్రిపేర్ కానుంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు బయల్దేరే రైళ్ల ఛార్టులను ముందురోజు రాత్రి 9 గంటలకల్లా వెల్లడిస్తారు. దీనివల్ల బెర్త్ దొరకనివారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు.

News July 6, 2025

31 మంది మందుబాబులకు జైలు శిక్ష: వరంగల్‌ CP

image

మద్యం తాగి వాహనం నడపిన 31 మందికి జైలు శిక్ష విధించినట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగా, పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతోందన్నారు. అలాంటి ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డ సందర్భాలూ ఉన్నాయన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.