News April 10, 2025

నంద్యాల: పండ్లు మాగించడంపై అవగాహన

image

అనుమతులున్న పౌడర్లు మాత్రమే వాడి మామిడి పండ్లను మాగించాలని జిల్లా అధికారులు అన్నారు. అందుకు ఏసీ గోడౌన్లను ఉపయోగించుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి నాగరాజు, మార్కెటింగ్ ఏడీఎస్ అబ్దుల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓ. వెంకట రాముడు, కాసింలు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో నిషేధిత క్యాల్షియం కార్బైడ్ వినియోగంపై బుధవారం పండ్ల వ్యాపారస్తులకు తెలిపారు.

Similar News

News July 4, 2025

GNT: సీలింగ్ భూముల క్రమబద్ధీకరణపై జేసీ సమీక్ష

image

సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన వారు ఈ ఏడాది డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సూచించారు. కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ అధికారులతో కలిసి తహశీల్దార్‌లు, సర్వేయర్‌లతో గుంటూరు కలెక్టరేట్‌లో జేసీ శుక్రవారం సమీక్ష చేశారు. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ కోసం గతంలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి అధికారులు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.

News July 4, 2025

రాష్ట్రంలో 3 దాడులు.. 6 కేసులు: అంబటి

image

AP: రాష్ట్రంలో పరిస్థితి మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా తయారైందని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. రోజూ ఎక్కడో ఓ చోట YCP కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ‘రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు కలిసి పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపటం లేదు. ఎవరు చంపుకున్నా YCP నేతలపైనే కేసులు పెడుతున్నారు. కూటమి సర్కార్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడం’ అని స్పష్టం చేశారు.

News July 4, 2025

జగిత్యాల : రోశయ్య జయంతి సందర్భంగా SP ఘన నివాళి

image

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కె.రోశయ్య జయంతిని జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి SP అశోక్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య దక్కించుకున్నారన్నారు.