News April 10, 2025

SRPT: రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేయండి: జగదీశ్వర్ రెడ్డి 

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక పురోగతిని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకానికి శ్రీకారం చుట్టిందని సూర్యాపేట జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలో పలు చర్చిల పాస్టర్లతో రాజీవ్ యువ వికాస్ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 14 వరకు దరఖాస్తు గడువు ప్రభుత్వం పెంచిందని తెలిపారు.

Similar News

News September 18, 2025

పాక్-సౌదీ మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం

image

పాకిస్థాన్-సౌదీ అరేబియా దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు వ్యూహాత్మక ఉమ్మడి రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారం ఏ ఒక్క దేశంపై దురాక్రమణ జరిగినా దానిని ఇరు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కార్యాలయం చెప్పినట్లు డాన్ న్యూస్ పేపర్ పేర్కొంది. డిఫెన్స్ సపోర్ట్‌ను మెరుగు పరచుకోవడానికి ఈ ఒప్పందం దోహద పడుతుందని ఆ దేశాలు ఆకాంక్షించాయి.

News September 18, 2025

సంగారెడ్డి: ‘లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు’

image

ప్రైవేట్ ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో వైద్యశాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా జిల్లాలో నిర్వహిస్తున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల పాల్గొన్నారు.

News September 18, 2025

SRD: భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో రీజినల్ రింగ్ రోడ్, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ కోసం జరుగుతున్న భూసేకరణ అంశాలను సమగ్రంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.