News April 10, 2025

పోచంపల్లి: నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్ 

image

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానంద గ్రామీణ తీర్థ సంస్థలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్ రిపేరింగ్, సీసీటీవీ ఇన్‌స్టాలేషన్ – మెయింటెనెన్స్ , హౌస్ వైరింగ్, జర్దోజి(అడ్వాన్సుడ్) శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ లక్ష్మి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Similar News

News February 26, 2026

కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>కొంకణ్<<>> రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌ 11 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అకౌంట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి B.Com, CA/CMA అర్హతగల అభ్యర్థులు మార్చి 10,11, 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వెబ్‌సైట్: https://konkanrailway.com.

News February 26, 2026

MBNR: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల బందోబస్తు పరిశీలించిన ఎస్పీ

image

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల సందర్భంగా ప్రభుత్వ బాలుర కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ డి.జానకి సందర్శించారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు, కఠిన పర్యవేక్షణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 26, 2026

సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం బుక్ చేసుకోండి

image

భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం ఒక ప్యాకెట్ ధర 151 రూపాయలు పెట్టి బుక్ చేసుకోవాలని రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ గురువారం అన్నారు. జిల్లా కార్యాలయంలో అందుకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవాలని సూచించారు. నేరుగా ఇంటికే తలంబ్రాలు చేరవేస్తారని తెలిపారు. మరింత సమాచారంకు 9154298637 సంప్రదించాలన్నారు.