News April 10, 2025
నిర్మల్ : నేడు, రేపు సదరం క్యాంపు

నిర్మల్ జిల్లాలో ఈనెల 10, 11వ తేదీన జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సదరం క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ డీఆర్డీఓ శ్రీనివాస్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇదివరకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని వెయిటింగ్ లిస్టులో ఉన్న వారు ఫ్లాట్ బుకింగ్ రసీదు, ఆధార్ కార్డు సంబంధిత పత్రాలతో ఉదయం 9 గంటలకు జిల్లా ఆసుపత్రికి రావాలన్నారు.
Similar News
News November 8, 2025
సంగారెడ్డి: 13 తేదీ లోపు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి: డీఈఓ

సంగారెడ్డి జిల్లాలోని అన్ని రకాల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 13 తేదీ లోపు స్కూల్ HMలకు పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. HMలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14లోపు ఫీజు చెల్లించాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18 లోపు డీఈవో కార్యాలయంలో అందించాలని అన్నారు. ఈ విషయాన్ని అన్ని రకాల పాఠశాలల హెచ్ఎంలు గమనించాలని పేర్కొన్నారు.
News November 8, 2025
కేశాలకు కర్పూరం

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాటిలో ఒకటే ఈ కర్పూరం నూనె. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు అప్లై చేసి తర్వాత రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
News November 8, 2025
మెదక్లో 5,857 ఇందిరమ్మ ఇళ్ల పనులు షురూ

మెదక్ జిల్లాలో మంజూరైన 9,181 ఇందిరమ్మ ఇళ్లలో 5,857 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. ఇంకా 3,324 ఇళ్ల పనులు మొదలుకాలేదన్నారు. ఇప్పటివరకు వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు రూ. 45 కోట్లు చెల్లించినట్లు వివరించారు. 400 అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్న లబ్ధిదారులుపై అంతస్తులో కూడా ఇల్లు నిర్మించుకోవచ్చని ఆయన సూచించారు. బేస్మెంట్, స్లాబ్ స్థాయిలో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.


