News April 10, 2025

జాతీయ జట్టు ప్రాబబుల్స్‌లో పదర యువతికి చోటు

image

భారత సబ్ జూనియర్ యూత్ ఏషియన్ కబడ్డీ జట్టు ప్రాబబుల్స్ జాబితాలో పదర యువతికి చోటు దక్కింది. మండల కేంద్రానికి చెందిన బండి నందిని జాబితాలో 31వ స్థానంలో ఎంపికైంది. ఈ ఎంపిక పట్ల గ్రామస్థులు యువతిని అభినందించారు. తెలంగాణ నుంచి కేవలం ఈ యువతి మాత్రమే ప్రాబబుల్స్‌కి ఎంపికైందని గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపారు.

Similar News

News December 31, 2025

డియర్ కపుల్స్.. మళ్లీ కొత్తగా స్టార్ట్ చేయండి!

image

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. అయితే దంపతులు కచ్చితంగా ఈ ఒక్క పని చేయాలి. ఈ ఇయర్‌లో జరిగిన గొడవలు, చేదు అనుభవాలు, నచ్చని విషయాలు, ఇద్దరినీ ఇబ్బంది పెట్టిన క్షణాలను ఈ ఏడాదికే పరిమితం చేయండి. వాటిని కొత్త సంవత్సరానికి మోసుకెళ్లి మీ మధ్య దూరాన్ని మరింత పెంచుకోకండి. సమస్యలుంటే ఇవాళే కూర్చుని మాట్లాడుకోండి. డియర్ కపుల్స్.. కొత్త సంవత్సరాన్ని కొత్తగానే స్టార్ట్ చేయండి. Happy New Year.

News December 31, 2025

పెదబయలు: మత్స్యగెడ్డలో మహిళా డెడ్‌బాడీ కలకలం

image

పెదబయలు మండల కేంద్రం సమీపంలోని లకేపుట్టు ఏకలవ్య పాఠశాల వెనక ఉన్న మత్స్యగెడ్డలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. బుధవారం ఉదయం మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా..ఎస్సై వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో డెడ్ బాడీని బయటకు తీయించి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఆమె ఫొటో ఆధారంగా వివరాలు తెలిస్తే 94409 04227 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.

News December 31, 2025

విద్యుత్ షాక్‌తో సత్యసాయి జిల్లా యువకుడు మృతి

image

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వివరాల మేరకు.. రొళ్ల మండలం అలుపనపల్లి గ్రామానికి చెందిన శిరీష్ రెడ్డి (26) GN పాళ్యం వ్యవసాయ భూమిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద కనెక్షన్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే కిందపడి మృతి చెందాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.