News April 10, 2025

పనిచేయకున్నా జీతం ఇస్తోన్న గూగుల్.. ఎందుకంటే?

image

తమ కంపెనీలోని టాలెంటెడ్ ఉద్యోగులను ప్రత్యర్థులు లాగేసుకోకుండా ఉండేందుకు గూగుల్ కాస్త తెలివిగా ఆలోచించింది. మార్కెట్‌లో Aiలో పోటీతత్వం పెరగడంతో ‘Google DeepMind’ అంటూ ఉద్యోగులతో ఒప్పందం చేసుకుంటోంది. దీనిపై సంతకాలు చేసిన వారికి ఏడాది వరకైనా పని చేయకపోయినా కంపెనీ జీతం ఇస్తుంటుంది. ఈ నిర్ణయం వీరు ఇతర కంపెనీలకు వెళ్లకుండా చేస్తుంది. అయితే దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News September 14, 2025

రెండో కాన్పు తర్వాత చాలా ఇబ్బంది పడ్డా: ఇలియానా

image

రెండో ప్రసవం తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందులను హీరోయిన్ ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘రెండో బిడ్డ పుట్టినప్పుడు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. ఆ సమయంలో పూర్తిగా గందరగోళంగా ఉంటుంది. నేను అది చాలా కష్టంగా ఫీలయ్యాను. మెంటల్ స్పేస్ పూర్తిగా లేకుండా పోయింది. ఆ సమయంలో నేను ముంబైలో లేను. అక్కడే ఉండుంటే నాకు సాయం చేసేందుకు ఫ్రెండ్స్ ఉండేవారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

News September 14, 2025

6 పరుగులకే 2 వికెట్లు

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. హార్దిక్ పాండ్య తొలి బంతికే వికెట్ తీశారు. ఓపెనర్ అయుబ్(0) ఇచ్చిన క్యాచ్‌ను బుమ్రా ఒడిసి పట్టారు. బుమ్రా వేసిన రెండో ఓవర్ రెండో బంతికి హారిస్ (3) పాండ్యకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోర్ 6/2.

News September 14, 2025

BREAKING: భారత్ ఓటమి

image

హాకీ ఆసియా కప్ ఫైనల్లో చైనా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. తుది పోరులో 4-1 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. దీంతో వరల్డ్‌కప్ ఆశలు ఆవిరయ్యాయి. తొలి నిమిషంలో నవనీత్ గోల్ కొట్టినా ఆ తర్వాత అమ్మాయిలు నెమ్మదించారు. అటు వరుస విరామాల్లో చైనా ప్లేయర్లు గోల్స్ కొట్టడంతో ఆసియా కప్-2025 విజేతగా నిలిచారు. చైనాకు ఇది మూడో టైటిల్.