News April 10, 2025
GOOD NEWS కాగజ్‌నగర్‌కు ట్రామా కేర్ సెంటర్

HYD పట్టణంలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యదర్శి అంజన్ కుమార్‌ను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు కలిశారు. అసెంబ్లీ సమావేశాల్లో ట్రామా కేర్ సెంటర్‌పై తాను మాట్లాడినందుకు కాగజ్‌నగర్ పట్టణంలో దీనిని మంజూరు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆదేశాలు జారీ చేయడం శుభ పరిణామమని అన్నారు. ఈ సందర్భంగా వైద్య విధాన పరిషత్ కార్యదర్శి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 13, 2025
BHPL: ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలి!

భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని బీసీ అభివృద్ధి అధికారి ఇందిర తెలిపారు. ఏడాదికి రూ.4వేల మంజూరు కొరకు డిసెంబర్ 15లోగా https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 13, 2025
కీలక ప్రాంతాల రక్షణ మహిళా DCPల చేతుల్లోనే!

HYD, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 16 జోన్లలో 7 జోన్లకు ప్రస్తుతం మహిళా డిప్యూటీ కమిషనర్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ అధికారులు సౌత్ జోన్- స్నేహ మెహ్రా, మాదాపూర్ ఐటీ కారిడార్- కే.శిల్పవల్లి, కీలకమైన ఇంటెలిజెన్స్ వింగ్ వంటి సున్నితమైన, ప్రముఖ ప్రాంతాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇది నగర పోలీసింగ్‌లో మహిళల ప్రాతినిధ్యం మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
News November 13, 2025
OU: బీఈ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈ (సీబీసీఎస్), బీఈ (నాన్ సీబీసీఎస్) కోర్సుల సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.


