News April 10, 2025
నిర్మల్: కొడుకు పట్టించుకోవడం లేదని SPకి ఫిర్యాదు

కంటికి రెప్పలా కాపాడుకొని పెంచిన పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అలాగే కాపాడుకోవాలి. కానీ పెంచి పోషించిన కొడుకు తమను ఇబ్బందులు పెడుతున్నాడని వృద్ధ దంపతులు SP కార్యాలయం మెట్లెక్కారు. దిలావర్పూర్‌కు చెందిన బెల్లాల్ నర్సయ్య ఆస్తిని పెద్ద కుమారుడు తన పేరు మీద ఆస్తిని రాయించుకొని మనోవేదనకు గురి చేస్తున్నాడని నిర్మల్ SP జానకి షర్మిలకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
Similar News
News November 26, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

ఎనుమాముల మార్కెట్‌కి బుధవారం మిర్చి తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.17,000 ధర రాగా.. బుధవారం రూ.17,100 అయింది. అలాగే, వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.19,500 ధర రాగా, ఈరోజు రూ.18,500 ధర వచ్చింది. మరోవైపు తేజ మిర్చికి నిన్న రూ.14,600 ధర వస్తే.. నేడు రూ.15,100 అయింది.
News November 26, 2025
త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు గడువు పెంపు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. త్రీ వీలర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
News November 26, 2025
దివ్యాంగులకు ఎల్లుండి ఆటల పోటీలు

నవంబర్ 28న జిల్లా దివ్యాంగులకు ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 54 ఏళ్ల మధ్య దివ్యాంగులకు పరుగు పందెం, షాట్‌పుట్, చెస్, జావెలిన్ త్రో, క్యారమ్స్ వంటి విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు కలెక్టర్ కార్యాలయ సముదాయం గ్రౌండ్‌లో ప్రారంభమయ్యే ఈ పోటీల్లో ఆసక్తిగల దివ్యాంగులు పాల్గొని ప్రోగ్రాంను విజయవంతం చేయాలన్నారు.


