News April 10, 2025

ASF: జిల్లాకు విజయవాడ నుంచి నకిలీ విత్తనాల సరఫరా

image

కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ హెచ్చరించారు. కాగజ్‌నగర్‌ నవత ట్రాన్స్‌పోర్ట్‌లో బెజ్జూర్ మండలం కృష్ణపెళ్లికి చెందిన కోకాడి చంద్రశేఖర్ పేరు మీద విజయవాడ నుంచి 45కిలోల నకిలీ పత్తి విత్తనాలను పార్సిల్ వచ్చిందన్నారు. దానిని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.1,57,500 ఉంటుందన్నారు.

Similar News

News February 24, 2026

SKLM: ఫిబ్రవరి 25న జాబ్ మేళా..రూ.16-26 వేలతో ఉద్యోగాలు

image

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడాప్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25న శ్రీకాకుళం నెహ్రూ యువ కేంద్రం వద్ద జాబ్ మేళా జరుగనుందని డీఆర్‌డీఏ పథకం సంచాలకులు కిరణ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సంస్థలైన డీ-మార్ట్, ఫ్యూషన్ ఫైనాన్స్‌ల్లో అసోసియేట్ క్యాషియర్, పర్చేజ్, రిలేషన్‌షిప్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి టెన్త్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. 19-35ఏళ్లు ఉండాలన్నారు. రూ.16-26 వేలు జీతం ఇవ్వనున్నారు.

News February 24, 2026

​బాపట్ల: ఈత పోటీలో గల్లంతైన బాధితుల వివరాలివే.!

image

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన పీటా. లీలావంశీకృష్ణ మరొకరు బాపట్ల మండలం ముత్తాయపాలెంలోని కనకాద్రినగర్‌కు చెందిన వేటగిరి చందు. మత్తులో ఈత కొడదాం అంటూ పందెం వేసుకున్నారు. ముందుగా చందు అవతలి ఒడ్డుకు వెళ్లి తిరిగి వస్తుండగా అలల ఉధృతికి అలసిపోయి కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు వంశీ వాగులోకి దూకగా, ఇద్దరూ గల్లంతయ్యారు.

News February 24, 2026

‘యంగ్ అండ్ ఫిట్’గా ఉన్నా.. ఈ క్యాన్సర్లు రావొచ్చు!

image

వయసుతో సంబంధం లేకుండా యువతలోనూ 6 రకాల క్యాన్సర్లు వేగంగా విస్తరిస్తున్నాయని హార్వర్డ్ స్టడీ హెచ్చరించింది. ముఖ్యంగా కొలొరెక్టల్, సర్వైకల్, క్లోమ, ప్రోస్టేట్, కిడ్నీ క్యాన్సర్లతో పాటు మల్టిపుల్ మైలోమా కేసులు యూత్‌లో పెరుగుతున్నాయి. ఒబెసిటీ, పొల్యూషన్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం దీనికి కారణాలు. ఆరోగ్యంగా ఉన్నామనే అపోహతో టెస్ట్‌లు చేయించుకోకపోతే వ్యాధి ముదిరి మరణాల రిస్క్ పెరుగుతోందని తేలింది.