News April 10, 2025
అంబేద్కర్ విగ్రహాలకు పునర్నిర్మాణం చేపట్టాలి: జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు అలంకరణ, కలర్, పునర్నిర్మాణం తదితర అంశాలను ఏప్రిల్ 14 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు నిర్మాణ పనులు చేపట్టాలని తెలిపారు.
Similar News
News October 30, 2025
నాగర్‌కర్నూల్: నూతన RTO భవనానికి 2 ఎకరాల స్థలం కేటాయింపు

స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నిరంతర కృషి ఫలితంగా నాగర్‌కర్నూల్‌కు కొత్త ఆర్టీఓ (RTO) కార్యాలయం మంజూరైంది. ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఆర్టీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధికారికంగా జీవోను విడుదల చేసింది. ఈ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించగా, సీఎస్‌ఆర్ నిధులతో రూ.50 లక్షలతో నూతన భవనం నిర్మించనున్నారు.
News October 30, 2025
పనులను పరిశీలించిన సీఎండీ వరుణ్ రెడ్డి

గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఫోర్ట్ రోడ్, నయీంనగర్, నక్కలగుట్ట ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పరిశీలించారు. ఇంజినీర్లు, సిబ్బందితో సీఎండీ మాట్లాడి వారికి పలు సూచనలను చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు త్వరగా చర్యలు తీసుకుని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సీఎండీ సూచించారు.
News October 30, 2025
మొంథా తుఫాను ప్రభావం.. పంట నష్టంపై మంత్రుల సమీక్ష

మొంథా తుఫాను ప్రభావం, భారీ వర్షాల నేపథ్యంలో సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి భేటీ అయ్యారు. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉందని పొన్నం ప్రభాకర్ వివరించారు. వెంటనే రైతులకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్ కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


