News April 10, 2025
NGKL: పోలీస్ వాహనంతో రీల్స్.. SP స్పందన ఇదే!

పోలీస్ వాహనంలో రీల్స్‌పై జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ బుధవారం స్పందించారు. ఈగలపెంట ఎస్ఐ వీరమల్లు మనవడు టిఫిన్స్ తెచ్చుకోవడానికి పోలీస్ వాహనాన్ని తీసుకెళ్లి రీల్స్ చేశాడు. పోలీస్ వాహనం దొంగతనం జరగలేదన్నారు. ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేసినందుకు ఎస్ఐ వీరమల్లుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో ఎవరిపై కేసు నమోదు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
KNR: జిల్లాస్థాయి “కళోత్సవ్” పోటీల్లో కలెక్టర్

KNR జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కళోత్సవ్ పోటీలను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ కళా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. సంగీతం, నృత్యం, కథ, దృశ్య కళలు వంటి 12కేటగిరీల్లో పోటీలు జరుగుతున్నాయన్నారు. మండలస్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి పోటీలు ప్రారంభించారు.
News September 18, 2025
గుండ్లవాగులో ఘనంగా బతుకమ్మ వేడుకలు!

పువ్వుల పండుగకు వేలయ్యింది. ములుగు జిల్లా కేంద్రంలోని తోపుకుంట, రామప్ప జంగాలపల్లి, ఏటూరునాగారంలోని బొడ్రాయి, రామాలయం, బస్టాండ్ తాడ్వాయిలోని మేడారం, కాల్వపల్లి, మంగపేటలోని రాజుపేట, తిమ్మంపేట, గోవిందరావుపేటలోని పస్రా, గుండ్లవాగు, రాళ్లవాగు, దెయ్యాలవాగు, వెంకటాపురంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, కన్నాయిగూడెం-రామాలయం, వాజేడులోని బొగత వద్ద బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. మీ గ్రామంలో వేడుకలు ఎక్కడ జరుగుతాయి?
News September 18, 2025
భూపాలపల్లిలో పువ్వుల పండుగ జరిగేది ఇక్కడే..!

ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలకు భూపాలపల్లి జిల్లా సిద్ధం అవుతోంది. రసంకుంట(గోరి కొత్తపల్లి), గణపేశ్వరాలయం(గణపసముద్రం), మామిడి కుంట చెరువు(చిట్యాల), దామెర చెరువు(రేగొండ), నైన్‌పాక ఆలయం(చిట్యాల), అయ్యప్ప దేవాలయం(కాటారం), టెకుమట్ల చెరువు, కాళేశ్వరం(మహదేవపూర్)తో పాటు పలిమెల, మల్హర్ మండలాల్లోని పలు చోట్ల వేడుకలు ఘనంగా జరుగుతాయి. మీ గ్రామంలో వేడుకలు ఎక్కడ జరుగుతాయో లొకేషన్ కామెంట్ చేయండి.