News April 10, 2025
జనగామ జిల్లాలో నలుగురు తహసీల్దార్ల బదిలీ

జనగామ జిల్లాలోని నలుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకుర్తి తహసీల్దార్ పి.శ్రీనివాస్‌ను జనగామ ఆర్డీవో కార్యాలయానికి, దేవరుప్పులకు జనగామ ఆర్డీవో కార్యాలయంలోని డీఏవో ఆండాళ్‌ను, దేవరుప్పుల తహసీల్దార్ మహిపాల్ రెడ్డిని తరిగొప్పులకు, తరిగొప్పుల తహసీల్దార్ నాగేశ్వర్ చారిని పాలకుర్తి తహసీల్దార్‌గా బదిలీ చేశారు.
Similar News
News January 12, 2026
పాపం శ్రీలీల.. బాలీవుడ్‌పైనే ఆశలు

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల చెప్పుకోదగ్గ హిట్లు లేక సతమతమవుతోంది. తెలుగులో గత ఏడాది చేసిన సినిమాలు ఆకట్టుకోలేదు. ఈ ఏడాది తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. శివ కార్తికేయన్ సరసన నటించిన ‘పరాశక్తి’ మూవీ తాజాగా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో అమ్మడికి కోలీవుడ్‌లో ఆఫర్లు రావడం గగనమేనని తెలుస్తోంది. ఈ క్రమంలో కార్తీక్ ఆర్యన్‌తో నటిస్తున్న బాలీవుడ్ మూవీపైనే ఈ బ్యూటీ ఆశలు పెట్టుకున్నారు.
News January 12, 2026
జాతీయస్థాయికి 11 మంది మెదక్ క్రీడాకారులు

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15, పోటీలలో 13 జిల్లాలకు చెందిన బాల, బాలికలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా బాలికల టీం రెండో స్థానం కైవసం చేస్తుందని తెలిపారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.
News January 12, 2026
89777 16661 ఈ నంబర్‌కి కాల్‌చేసి సమస్య చెప్పుకోవచ్చు

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు డయల్ యువర్ APSCDCL CMD కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు CMD శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 89777 16661 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. సర్వీస్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.


