News March 27, 2024

పిల్లలను ప్రచారానికి వాడొద్దు

image

AP: ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పిల్లలను వాడుకోవద్దని రాజకీయ పార్టీలకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సూచించింది. 18 ఏళ్ల లోపు బాలలను సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాల్లో వినియోగించవద్దని కమిషన్ ఛైర్మన్ అప్పారావు అన్నారు. ఉల్లంఘిస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. కొద్ది రోజులుగా కొందరు అభ్యర్థులు బాలలను ఎన్నికల పనులకు ఉపయోగిస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు.

Similar News

News January 23, 2026

జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా TN అసెంబ్లీలో తీర్మానం

image

జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు చేరింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం స్టాలిన్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ఉపాధి హామీ చట్టానికి మహాత్మాగాంధీ పేరు తీసేసి జీ రామ్ జీగా మార్చడాన్ని DMK వ్యతిరేకిస్తూ వస్తోంది. తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికే పంజాబ్, TG ప్రభుత్వాలు ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.

News January 23, 2026

ఇద్దరు హంతకులు.. జైలులో ప్రేమ.. పెరోల్‌తో పెళ్లి!

image

ఇద్దరు హంతకుల మధ్య జైలులో చిగురించిన ప్రేమ పెరోల్‌తో పెళ్లి పీటలెక్కింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువకుడి హత్య కేసులో ప్రియా సేథ్ జీవిత ఖైదు అనుభవిస్తోంది. ప్రియురాలి భర్త, ఆమె ముగ్గురు పిల్లలు, మరో వ్యక్తిని చంపిన కేసులో హనుమాన్ ప్రసాద్ జైలులో ఉన్నాడు. ప్రియ, ప్రసాద్ మధ్య సంగనేర్‌(RJ) ఓపెన్ జైలులో ప్రేమ చిగురించింది. వీరికి 15రోజుల అత్యవసర పెరోల్‌ను RJ హైకోర్టు మంజూరు చేసింది. నేడు వీరి వివాహం.

News January 23, 2026

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత

image

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై విధించిన నిషేధాన్ని హైకోర్టు ఎత్తివేసింది. రాష్ట్ర ప్రభుత్వం విధించే షరతులకు లోబడి తిరిగి ప్రారంభించుకోవచ్చని సూచించింది. యాప్ ఆధారిత ద్విచక్ర వాహన రవాణాను నిషేధిస్తూ 2025 జూన్‌లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఓలా, ఉబెర్ తదితర సంస్థలు HCని ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సింగిల్ బెంచ్ సమర్థించింది. తాజాగా డివిజన్ బెంచ్ ఆ తీర్పును పక్కన పెట్టింది.