News April 10, 2025
నా తర్వాతి సినిమా ఇదే: రామ్‌గోపాల్ వర్మ

తన కెరీర్లో తొలిసారిగా హారర్ కామెడీ సినిమా చేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్లో తెలిపారు. ‘‘ప్రజలకు భయమేస్తే పోలీసుల వద్దకు పరిగెడతారు. మరి పోలీసులే భయపడితే’ అన్న కాన్సెప్ట్‌తో హారర్ కామెడీ జానర్లో సినిమాను తీస్తున్నా. మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘పోలీస్ స్టేషన్లో దెయ్యం’ అన్నది సినిమా టైటిల్. ‘చనిపోయిన వారిని చంపలేరు’ అన్నది ట్యాగ్‌లైన్’ అని RGV పేర్కొన్నారు.
Similar News
News September 15, 2025
BREAKING: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ASIA CUP-2025: పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 127/9 పరుగులు చేసింది. అనంతరం భారత్ వేగంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31), సూర్యకుమార్ యాదవ్ 47*, తిలక్ వర్మ 31 రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఒమన్‌తో ఆడనుంది.
News September 15, 2025
బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9లో తొలి వారం శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఆమెను ఎలిమినేట్ చేసినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో నామినేషన్స్‌లో ఉన్న నటి ఫ్లోరా సైనీ, సుమన్ శెట్టి, రీతూ చౌదరి సేఫ్ జోన్‌లోకి చేరుకున్నారు. వీళ్లు హౌస్‌లోనే కొనసాగనున్నారు. కొరియోగ్రాఫర్ అయినా శ్రష్ఠి ఈ సీజన్‌లో సెలబ్రిటీ కోటాలో హౌస్‌లోకి వెళ్లారు.
News September 15, 2025
నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు: గడ్కరీ

ఇథనాల్ పెట్రోల్ విషయంలో తాను అవినీతికి పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. ‘నాకు షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిలరీ, పవర్ ప్లాంట్ ఉన్నాయి. నా ఆదాయం పుష్కలంగా ఉంది. నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు. నాకు దిగజారే అవసరం లేదు’ అని నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వెల్లడించారు.