News April 10, 2025
చిత్తూరు-కాట్పాడి డబుల్ లైన్‌కు గ్రీన్ సిగ్నల్

తిరుపతి-కాట్పాడి డబుల్ లైన్ నిర్మాణానికి రూ.1332 కోట్లతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు బీజేపీ సీనియర్ నాయకుడు చిట్టిబాబు వెల్లడించారు. తిరుపతి-పాకాల, చిత్తూరు-కాట్పాడి వరకు సింగిల్ లైనే ఉంది. 104 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గాన్ని డబుల్ లైన్‌గా మార్చనున్నారన్నారు. ఈ పనులు పూర్తి అయితే శ్రీకాళహస్తి-చెన్నై మార్గంలో బెల్లం, గ్రానైట్, మామిడి ఎగుమతులు పెరుగుతాయి.
Similar News
News April 18, 2025
చిత్తూరులో రేపు మెగా జాబ్ మేళా

చిత్తూరు గ్రీన్ పేటలోని డిగ్రీ కళాశాలలో 19న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DSDO గుణశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 20 ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న 1,000 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్ నుంచి ఎంబీఏ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అవ్వాలన్నారు.
News April 18, 2025
చిత్తూరు: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అందించే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలకు అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎస్డీవో బాలాజీ తెలిపారు. అర్హులైనవారు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు డీఎస్ఏ కార్యాలయాన్ని సంప్రదించాలని ఓ ప్రకటనలో కోరారు.
News April 18, 2025
చిత్తూరు: ఒకటవ తరగతికి ఆన్లైన్ అడ్మిషన్లు

ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి సూచించారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్లకు ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలు చేయాలన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీలోపు www.cre.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాలన్నారు.