News April 10, 2025
HYD: చికెన్, మటన్ షాపులు బంద్

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. మాంసం దుకాణాలు నేడు బంద్ చేయాలని GHMC ఉత్వర్వులు జారీ చేసింది. కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసి ఉంటాయని ప్రకటించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. GHMC లిమిట్స్‌లోని అన్ని మాంసం దుకాణాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
SHARE IT
Similar News
News September 17, 2025
నిజాం కాలం నాటి ఆసిఫాబాద్ జైలు

ఆసిఫాబాద్ జిల్లాలోని జన్కాపూర్‌లో 1916లో ఐదెకరాల్లో నిర్మించిన జైలు భవనం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. డంగు సున్నంతో నిర్మించిన ఇందులో 200 మంది ఖైదీలు ఉండేలా మూడు బారక్‌లు ఉన్నాయి. 1991లో మరమ్మతులు చేసి తిరిగి ప్రారంభించగా, 2008లో జిల్లా జైలు తరలింపు తర్వాత ఇది సబ్ జైలుగా రూపాంతరం చెందింది. ఈ భవనం ఇప్పటికీ చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది.
News September 17, 2025
వరంగల్: ట్రెండ్ ఫాలో అవ్వండి.. కానీ మోసపోకండి..!

‘సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఫొటోలు, లింకుల కోసం అపరిచిత వెబ్‌సైట్లను ఆశ్రయించకండి. తెలియని వ్యక్తులు షేర్ చేసిన లింకులపై క్లిక్ చేయకండి’ అని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తపడాలని, ఏ వెబ్‌సైట్ అయినా యూఆర్‌ఎల్‌ను రెండుసార్లు చెక్ చేయడం అలవాటు చేసుకోవాలని తమ అధికారిక X ఖాతా ద్వారా ప్రజలకు సూచించారు.
News September 17, 2025
జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి: అంజన్ కుమార్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పేరు అనుహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇటీవల ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ అంటూ వెలసిన ఫ్లెక్సీలకు అంజన్ కుమార్ యాదవ్ బలం చేకూర్చారు. ‘యాదవ సామాజిక వర్గానికి సిటీలో ప్రాతినిధ్యం లేదు. జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి’ అంటూ కుండబద్దలు కొట్టారు. మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందని, హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.