News April 10, 2025
సిరిసిల్ల వాసులారా.. మీ పిల్లలపై ఓ కన్నేయండి

వేసవి కాలం వచ్చింది అంటే చాలు చెరువులు, వాగులు, కాల్వల్లో పిల్లలు ఈత కొట్టడాన్ని మనం చూస్తూనే ఉంటాం. వీరిలో వేసవి తాపం తీర్చుకోవడానికి కొందరు, సరదా కోసం ఇంకొందరు, ఈత నేర్చుకోవడానికి మరికొందరు వెళ్తుంటారు. సరదా మాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించకుండా నీటిలో దిగడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఓ కన్నేసి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News November 6, 2025
డిసెంబర్ 3 నుంచి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

మెదక్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థుల కోసం (6 నుండి 12వ తరగతి) జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు డీఈవో రాధాకిషన్ తెలిపారు. ఈ ప్రదర్శనలు డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో జరుగుతాయి. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈవో సూచించారు.
News November 6, 2025
RPT: పొలంలో కరెంటు తీగలు తగిలి వృద్ధుడు మృతి

పొలంలో కరెంటు తీగలు తగిలి వృద్ధుడు మృతి చెందిన ఘటన రామన్నపేట PS పరిధిలో జరిగింది. తుమ్మలగూడెంలో గోర్లా మల్లయ్య(75) NOV 5న గేదెలను మేపడానికెళ్లి ఇంటికి రాలేదు. మనవళ్లు, గ్రామస్థులు వెతికినా జాడలేదు. గురువారం ఉదయం గర్దాసు శ్రీను బావి వద్ద అతను, గేదె చనిపోయి కనిపించారు. తీగలకు తగిలి మరణించాడని భార్య ఫిర్యాదు చేసింది. రామన్నపేటలో పోస్ట్ మార్టం చేయించి డెడ్ బాడీని అప్పజెప్పినట్లు SI నాగరాజు తెలిపారు.
News November 6, 2025
కశింకోట: 48 కిలోల గంజాయి పట్టివేత

కశింకోట మండలం అచ్చెర్ల జంక్షన్ వద్ద గురువారం 48 కిలోల గంజాయి (20 ప్యాకెట్లు) స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. ఈగల్ టీమ్ సమాచారంతో తనిఖీలు చేపట్టగా, వైట్ మారుతి కారులో గంజాయిని గుర్తించామన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరొక వ్యక్తి పరారైనట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


