News April 10, 2025
నిజామాబాద్: ఆపరేషన్ ఛబుత్రా.. మళ్లీ స్టార్ట్

నిజామాబాద్‌తో పాటు ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ‘ఆపరేషన్ ఛబుత్రా’ మళ్లీ ప్రారంభమైంది. నగరంలోని రోడ్లపై అర్ధరాత్రి వేళ తిరిగే వారి ఆట కట్టించేందుకు పోలీసులు గతంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కొంత కాలం పక్కాగా అమలు చేసి తర్వాత వదిలేశారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో ఇటీవల మళ్లీ ఆపరేషన్ ఛబుత్రా ను షురూ చేశారు. మంగళవారం సాయంత్రం NZB శాంతి నగర్‌లో యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Similar News
News January 4, 2026
నిజామాబాద్: రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్న జిల్లా మహిళలు

హైదరాబాద్ రవీంద్రభారతిలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బుగ్గలి రజక స్వప్న(కులవృత్తిలో సేవలు), సురుకుట్ల ఝాన్సీ (వ్యాపార రంగం) తమ రంగాల్లో చూపిన ప్రతిభకు అవార్డులను అందుకున్నారు. ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, కమిటికీ కృతజ్ఞతలు తెలిపారు.
News January 4, 2026
టర్కీలో గుండెపోటుతో వేల్పూర్ వాసి మృతి

వేల్పూర్ గ్రామానికి చెందిన జెల్లా ప్రవీణ్ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. బతుకుతెరువు కోసం టర్కీ దేశానికి వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయాడు. కొద్దరోజులకే అతడు మృతి చెందడంతో కుటుంబంలో విషదం నెలకొంది. కాగా అక్కడి నుంచి మృతదేహం రావాల్సి ఉంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
News January 3, 2026
297 మంది తెలుగు యువతకు విముక్తి: ఎంపీ అరవింద్

నకిలీ ఉద్యోగాల పేరిట థాయిలాండ్, మయన్మార్‌లలో చిక్కుకున్న 297 మంది తెలుగు యువతను కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా రక్షించింది. ఎంపీ అరవింద్ లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించగా విదేశాంగ శాఖ స్పందించింది. మొత్తం 2,545 మంది భారతీయులు అక్రమ రవాణాకు గురికాగా, రాయబార కార్యాలయాల చొరవతో ఇప్పటివరకు 2,390 మందిని రక్షించినట్లు కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 297 మంది సురక్షితంగా విముక్తి పొందారు.


