News April 10, 2025
నిర్మల్ : నేడు, రేపు సదరం క్యాంపు

నిర్మల్ జిల్లాలో ఈనెల 10, 11వ తేదీన జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సదరం క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ డీఆర్డీఓ శ్రీనివాస్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇదివరకు ఆన్‌లైన్లో స్లాట్ బుక్ చేసుకొని వెయిటింగ్ లిస్టులో ఉన్న వారు ఫ్లాట్ బుకింగ్ రసీదు, ఆధార్ కార్డ్, సంబంధిత పత్రాలతో ఉదయం 9 గంటలకు జిల్లా ఆసుపత్రికి రావాలన్నారు.
Similar News
News January 10, 2026
GNT: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత డి. ఆంజనేయులు

జర్నలిస్ట్ ధూళిపూడి ఆంజనేయులు (డి.ఎ) సాహితీ లోకానికి చిరపరిచితులు. గుంటూరు జిల్లా యలవర్రులో 1924 జనవరి 10న జన్మించిన ఆయన, ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికల్లో పనిచేశారు. ఆకాశవాణి ‘వాణి’ పత్రికకు సంపాదకత్వం వహించారు. తెలుగు సాహిత్యాన్ని, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితలను ఆంగ్లంలోకి అనువదించి ఇతర ప్రాంతాల వారికి పరిచయం చేశారు. కందుకూరి, సి.ఆర్.రెడ్డి జీవిత చరిత్రలు రచనలు చేశారు.
News January 10, 2026
కర్నూలు పోలీసుల డబ్బుల బేరం.. రంగంలోకి DGP!

KNLలోని ఓ PSలో పనిచేస్తున్న నలుగురు క్రైం పార్టీ సిబ్బంది అవినీతి చర్చనీయాంశమైంది. ఇటీవల ఓ చోరీ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారిని కర్నూలుకు తీసుకొచ్చారు. అయితే మార్గమధ్యంలో శివరాంపల్లి వద్ద అతనితో బేరం కుదుర్చుకొని డబ్బులు ఫోన్ పే చేయించుకున్నారు. ఈ విషయంపై ఆ వ్యాపారి తెలంగాణ ప్రజాప్రతినిధుల ద్వారా AP DGPతో మాట్లాడించారు. చర్యలకు జిల్లా ఉన్నతాధికారులను DGP ఆదేశించినట్లు తెలుస్తోంది.
News January 10, 2026
వరంగల్: 13 మంది బాల కార్మికులకు విముక్తి

ఆపరేషన్ స్మైల్ 12వ విడతలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో AHTU ఆధ్వర్యంలో ఇద్దరు బాలికలతో సహా 13 మంది బాల కార్మికులకు పని నుంచి విముక్తి కలిగించారు. ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ పరిధిలో ఐదుగురు, వెస్ట్ జోన్ పరిధిలో ఐదుగురు, ఈస్ట్ జోన్ పరిధిలో ముగ్గురు బాలలను రక్షించినట్లుగా అధికారులు వెల్లడించారు.


