News April 10, 2025
MNCL: ఉచిత సమ్మర్ కోచింగ్.. APPLY NOW

మే 1 నుంచి 31 వరకు ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంపులకు పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కీర్తి రాజవీరు తెలిపారు. ఉదయం 6 నుంచి 8.30 వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 17 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News January 1, 2026
DPR లేని ప్రాజెక్టుకు రూ.27వేల కోట్లు చెల్లించారు: రేవంత్

TG: పార్టీని బతికించుకునేందుకు KCR మళ్లీ చంద్రబాబు పేరును, నీటి సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని CM రేవంత్ ఆరోపించారు. కృష్ణా జలాలపై మీడియాతో మాట్లాడారు. పాలమూరు-RR ప్రాజెక్టుకు KCR ఏడేళ్లు DPR సమర్పించలేదన్నారు. దీంతో పర్యావరణ అనుమతులు రాలేదని, అనుమతులు లేని ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ కొందరు కేసులు వేశారన్నారు. DPR లేని ప్రాజెక్టుకు కమీషన్ల కోసం KCR రూ.27వేల Cr చెల్లించారని విమర్శించారు.
News January 1, 2026
చిత్తూరు కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను పలువురు అధికారులు గురువారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బొకేలు, పండ్లు అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో JC విద్యాధరి, డీఆర్వో మోహన్ కుమార్, మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎస్ఎస్పీఎ వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఐఅండ్ పీఆర్ అధికారి వేలాయుధం తదితరులు ఉన్నారు.
News January 1, 2026
NRPT: ’86 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు’

డిసెంబర్ 31న నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 86 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ డా.వినీత్ గురువారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇవాళ ఉదయం 6 గంటల వరకు తనిఖీలు చేశారని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


