News April 10, 2025
కాకినాడ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక

కాకినాడ జిల్లాలో గురువారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రెండు రోజుల నుంచి వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో రైతుల్లో గుబులు మొదలైంది.
Similar News
News April 19, 2025
MPL: చిరుత మృతి.. వెలుగులోకి కొత్త విషయాలు?

మదనపల్లె పొన్నేటిపాళ్యం వద్ద చిరుత పులిని చంపిన కేసులో డొంక కదులుతోంది. ఈ కేసులో అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా, తప్పించుకు తిరుగుతున్న వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు.. వన్యప్రాణులను వేటాడి బక్షించడమే కాకుండా నగదుకు విక్రయాలు చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలిందని సమాచారం. దీని వెనక ప్రొఫెషనల్స్ ముఠా ఉన్నట్లు తెలుస్తోది.
News April 19, 2025
ఖమ్మం: డిగ్రీ విద్యార్థులలో అయోమయం

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు సోమవారం నుంచి 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ యూనివర్సిటీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు హాల్ టికెట్లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలు కొనసాగుతాయా? వాయిదా పడతాయా? యూనివర్సిటీ అధికారులు తెలపకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News April 19, 2025
OTTలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్.. ఈ వీకెండ్ చూసేయండి..

*Officer On Duty- Netflix: తాకట్టులో పెట్టిన దొంగ బంగారంతో కథ మొదలవుతుంది. కుంచాకో బోబన్ దర్యాప్తు.. ఒక సీరియల్ కిల్లర్ గ్యాంగ్ దగ్గరకు చేరుతుంది. ఇన్టెన్స్, యాక్షన్, ఎమోషన్‌తో సాగే ఒక బెస్ట్ క్రైమ్ డ్రామా.
*Dahaad(సిరీస్)- Prime: మిస్సైన అమ్మాయిలు పబ్లిక్ టాయిలెట్‌లో శవాలుగా దొరుకుతుంటారు. ఈ మిస్టరీ ఛేదించేందుకు సోనాక్షి యాక్షన్‌లోకి దిగుతుంది. పోలీసులతో కిల్లర్ ఆడే మైండ్ గేమ్ కట్టిపడేస్తుంది.