News April 10, 2025
వైఎస్ జగన్ రామగిరి పర్యటన.. కేసు నమోదు

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడి ఘటనపై కేసు నమోదైంది. వైసీపీ శ్రేణులు హెలికాప్టర్ వద్దకు దూసుకెళ్లగా అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ రంగారెడ్డి అస్వస్థతకు గురై అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు సీకేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 16, 2025
KNR: మహిళా డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025 -26 విద్యాసంవత్సరం పీజీ కోర్సుల్లో ఖాళీల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రో.డి.వరలక్ష్మి తెలిపారు. ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, ఎంకాం, ఎమ్మెస్సీ బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో ఈ నెల 17వ తేదీ సా. 5గం.లలోపు అందజేయాలని సూచించారు. 18వ తేదీన సీటు కేటాయించనున్నట్లు తెలిపారు.
News November 16, 2025
KNR: ప్రశాంతంగా డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 5వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 9999 విద్యార్థులకు గాను 9722 మంది విద్యార్థులు హాజరయ్యారు. 277 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 3వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 8676 విద్యార్థులకు గాను 8425 మంది విద్యార్థులు హాజరయ్యారు. 250 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
News November 16, 2025
జగిత్యాల: పలువురు ఎస్‌ఐలకు కొత్త పోస్టింగ్‌లు

జగిత్యాల జిల్లాలో పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ SP అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మపురి SHO పి.ఉదయ్ కుమార్‌ను వెల్గటూర్ SHOగా, జగిత్యాల రూరల్ SHO ఎన్.సదాకర్‌ను జగిత్యాల DCRBకి, వెల్గటూర్ SHO ఆర్.ఉమాసాగర్‌ను జగిత్యాల రూరల్ SHOగా బదిలీ చేశారు. భీమ్గల్ PS SI–I జి.మహేష్‌ను ధర్మపురి SHOగా నియమించారు. బదిలీ అయిన ఎస్‌ఐల రిలీవ్ తేదీలను వెంటనే రిపోర్ట్ చేయాలని SP సూచించారు.


