News April 10, 2025
కోనసీమ: డీఎస్సీ శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ-బీసీ కులాలకు చెందిన అభ్యర్ధులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ-2025 పరీక్షకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి సత్య రమేష్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ-బీసీ కులాలకు చెందిన అభ్యర్ధులకు టెట్ పరీక్షలో అర్హత సాధించి అత్యధిక మార్కులు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News January 15, 2026
పక్షిలా ఎగరాలి అంటే.. భీమవరం రండి..!

కాళ్ల మండలం పెదమీరంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ‘స్కైరైడ్ అడ్వెంచర్’ను బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా రైడ్ చేసి, గగన విహారం అద్భుతమైన అనుభవమని కొనియాడారు. ఈ నెల 14 నుంచి 16 వరకు ప్రజలకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సాహస క్రీడను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
News January 15, 2026
నేడు మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి వరపూజ

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి వరపూజ మహోత్సవం గురువారం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మహేష్ తెలిపారు. స్వామి వారికి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు వరపూజ కత్రువు సంక్రాంతి రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మేలో జరిగే నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేడు వరపూజ, నిశ్చయ తాంబూల స్వీకరణ ఉంటుందన్నారు. కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరు కానున్నారు.
News January 15, 2026
ప,గో: న్యాయస్థానంలో ఉద్యోగ అవకాశాలు

ఉమ్మడి ప.గో లీగల్ సర్వీసెస్ అథారిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా జడ్జ్ శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు ఏలూరు జిల్లా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.


