News April 10, 2025
తూ.గో. జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక

తూ.గో. జిల్లాలో గురువారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రెండు రోజుల నుంచి వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో రైతుల్లో గుబులు మొదలైంది.
Similar News
News January 25, 2026
రాజమండ్రి: రేపు PGRS కార్యక్రమం రద్దు

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకల నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన PGRSను రద్దు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. రిపబ్లిక్ డే కారణంగా రెవెన్యూ క్లినిక్ అర్జీల స్వీకరణ ఉండదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
News January 25, 2026
తూ.గో: 12.5 టన్నుల గంజాయి దహనం

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో గత నాలుగేళ్లుగా సీజ్ చేసిన 12,570 కేజీల గంజాయిని శనివారం నిర్వీర్యం చేశారు. కాపుల ఉప్పాడలోని జిందాల్ ప్లాంట్‌లో రెవెన్యూ అధికారుల సమక్షంలో ఎస్పీ నరసింహ కిషోర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. చట్టప్రకారం ప్రణాళికాబద్ధంగా, పర్యావరణానికి హాని కలగకుండా గంజాయిని దహనం చేశామని, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.
News January 25, 2026
తూ.గో: జనవరి 30, 31 తేదీలలో కోకో కాన్క్లేవ్

ఏపీ ప్రభుత్వం, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కోకో కాన్క్లేవ్ – 2026 కార్యక్రమాన్ని జనవరి 30, 31 తేదీలలో ఏలూరులోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు తూ.గో జిల్లా ఉద్యాన అధికారి ఎన్.మల్లికార్జునరావు శనివారం తెలిపారు. ఈ కాన్క్లేవ్‌లో కోకో పంటకు సంబంధించిన నాణ్యత మెరుగుదల, పంట కోత అనంతర నిర్వహణ తదితర వాటిపై అవగాహన కల్పిస్తారన్నారు. కోకో రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


