News April 10, 2025
నక్కపల్లి: అనుమానస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

నక్కపల్లి మండలం ఉద్దండపురానికి చెందిన A.లక్ష్మీ (60) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈనెల 4న గ్రామానికి చెందిన ప్రత్యర్థులు తనపైన, తన తల్లిపైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని సురేశ్ తెలిపారు. కాగా ఈనెల 7న లక్ష్మీకి కడుపునొప్పి రాగా KGHకి తరలిస్తుండగా మృతి చెందినట్లు సురేశ్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI సన్నిబాబు తెలిపారు.
Similar News
News September 16, 2025
రేపు పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో వైద్య శిబిరం

పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో బుధవారం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డా. జి.నాగభూషణరావు మంగళవారం తెలిపారు. స్వస్థ నారి శక్తి పరివార్ అభియాన్‌లో భాగంగా ఈ క్యాంపును నిర్వహించనున్నట్లు వివరించారు. మహిళలు, పిల్లల అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఇది చక్కని వేదికన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 16, 2025
అనకాపల్లి: రేషన్ షాపులకు ఈ-పాస్ పరికరాలు

జిల్లాలో రేషన్ షాపులకు అధునాతనమైన ఈ-పాస్ పరికరాలను అందజేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ జాహ్నవి తెలిపారు. కలెక్టరేట్లో డీలర్లకు మంగళవారం ఈ-పాస్ మిషన్లు అందజేశారు. వినియోగదారులకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించినందుకు జిల్లాలో 1069 రేషన్ షాపులకు వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.
News September 16, 2025
సిద్ధిపేట: ‘కేసులను త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి’

SC, ST కేసులలో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని సీపీ కమిషనర్ అనురాధ ACPకి సూచించారు. మంగళవారం ఏసీపీ ఆఫీసును సీపీ సందర్శించి రికార్డ్స్, క్రైమ్ ఫైల్స్ తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న OE త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఏసీపీ రవీందర్ రెడ్డి టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సీసీఆర్పీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.