News April 10, 2025
జమ్మలమడుగు: అది ప్రమాదం కాదు.. హత్యే.!

జమ్మలమడుగు-ముద్దనూరు రోడ్డులో మార్చి 24న ప్రమాదంలో గుడెంచెరువుకు చెందిన కిశోర్ బాబు మృతిచెందాడు. ఈ యాక్సిడెంట్‌ను పక్కా ప్లాన్‌తో ఉదయ్ కుమార్ చేశాడని CI లింగప్ప బుధవారం తెలిపారు. మార్చి 20న కిశోర్ బాబు మేనమామ కిరణ్ తల్లి దినం కార్యక్రమంలో ఉదయ్ కుమార్ భార్యను కిశోర్ కొట్టాడని వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని పక్కాప్లాన్‌తో యాక్సిడెంట్ చేశాడని CI తెలిపారు.
Similar News
News January 21, 2026
రికార్డు సృష్టించిన కడప

ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీలో కడప జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. కార్గో మాసోత్సవాల్లో భాగంగా 10,961 టార్గెట్ కాగా ఏకంగా 17,937 డెలివరీలు పూర్తి చేశారు. మంగళవారం 4వ విడత లక్కీ డిప్ విజేతలకు ‘కోతాస్ ప్రొడక్ట్స్’ ఛైర్మన్ అభిరామ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని డీపీటీవో గోపాల్ రెడ్డి కోరారు. పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
News January 20, 2026
రామచంద్రమూర్తికి జీవన సాఫల్య పురస్కారం: YVU వీసీ

ప్రముఖ జర్నలిస్టు, సంపాదకులు కె.రామచంద్రమూర్తికి గజ్జెల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కారం-2025 ఇవ్వనున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయ వి.సి ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందించిన జర్నలిస్టులకు ప్రతి ఏటా ఒకరికి అవార్డును అందజేస్తున్నారు. 2025కు ఈయన్ను ఎంపిక చేశామన్నారు.
News January 20, 2026
లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర ఎప్పుడంటే..?

లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో గంగమ్మ జాతర జరగనుంది. దీనికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతర నిర్వాహకులకు మంగళవారం సూచించారు. గ్రామంలో జరిగిన గంగమ్మ పార్వేట ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు విశేష సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.


