News April 10, 2025
GOOD NEWS కాగజ్‌నగర్‌కు ట్రామా కేర్ సెంటర్

కాగజ్‌నగర్‌లో ట్రామా కేర్ సెంటర్ మంజూరు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు HYDలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యదర్శి అంజన్ కుమార్‌ను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు కలిసి ధన్యావాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ట్రామా కేర్ సెంటర్‌పై తాను మాట్లాడినందుకు కాగజ్‌నగర్‌లో దాన్ని మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News January 13, 2026
IPL 2026లో RCBకి కొత్త హోంగ్రౌండ్!

వచ్చే IPL సీజన్ కోసం RCBకి కొత్త హోంగ్రౌండ్స్ ఎంచుకుందన్న వార్తలు వైరలవుతున్నాయి. భద్రతా ప్రమాణాల దృష్ట్యా చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచులు నిర్వహించేందుకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆడాల్సిన 7 హోంగ్రౌండ్ మ్యాచుల్లో 5 DY పాటిల్ స్టేడియం(నవీ ముంబై), 2 రాయ్‌పూర్‌లో ఆడుతుందని తెలుస్తోంది. RCB కప్పు కొట్టిందని చిన్నస్వామిలో నిర్వహించిన కార్యక్రమంలో 11మంది చనిపోయిన విషయం తెలిసిందే.
News January 13, 2026
బెల్లంపల్లి కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని మంత్రికి వినతి

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో బెల్లంపల్లి కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని జిల్లా సాధన కమిటీ ప్రచార సహాయ కార్యదర్శి శ్రీనివాస్ కోరారు. మంత్రి వివేక్‌కు వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి జిల్లాకు అనుకూలమైన అన్ని అంశాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు మధ్యన ఉండడంతో పరిపాలన సౌలభ్యంగా ఉంటుందన్నారు.
News January 13, 2026
వికారాబాద్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది..!

వికారాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో తాండూర్ మున్సిపాలిటీలో 36 వార్డుల్లో 77,110 ఓటర్లు, వికారాబాద్‌లో 34 వార్డులకు 58,117, పరిగిలో 18 వార్డుల్లో 27,616, కొడంగల్‌లో 12 వార్డులకు 11,318 మంది ఓటర్లు ఉన్నారు. తుది జాబితాను ఆయా మున్సిపాలిటీల్లోని నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. ఫైనల్ లిస్ట్‌లో మీపేరు ఉందా చెక్ చేయండి.


