News April 10, 2025

26 మంది అమ్మాయిలను మోసం చేసిన రాజమండ్రి యువకుడు

image

MLA ఫొటోలను DPగా పెట్టి 26 మంది యువతులను మోసం చేసిన రాజమండ్రి యువకుడు హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మ్యాట్రీమోనీ సైట్ల ద్వారా అమ్మాయిలకు వల విసురుతూ నగదు దోచేశాడని అతడిమీద కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు వంశీని 5రోజుల కస్టడీకి తీసుకున్నారు. యానాం MLA శ్రీనివాస్ ఫొటోలను వాడుకున్నట్లు చెప్పాడు. స్నేహితుల నుంచి తీసుకున్న 3సిమ్ కార్డులతో నేరాలకు పాల్పడ్డట్లు తేలింది.

Similar News

News January 19, 2026

సంతానలేమిని నివారించే ఖర్జూరం

image

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.

News January 19, 2026

ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్.. కాకినాడలో రికార్డు

image

కాకినాడలో రూ.83 వేల కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఏటా 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ను పర్యావరణ పరిరక్షణలో అగ్రగామిగా నిలపనుంది. తొలి దశలో 1 మిలియన్ టన్నుల ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించే ఈ ప్లాంట్ ద్వారా లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గనున్నాయి.

News January 19, 2026

నల్గొండ: కూతురి బర్త్ డే.. తల్లి మృతి

image

కుమార్తె పుట్టినరోజు వేళ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. యాదగిరిగుట్ట మండలం మల్లాపురానికి చెందిన కర్రీ లాస్య సంక్రాంతికి వలిగొండ పులిగిల్లలోని తల్లిగారి పుట్టింటికి వచ్చింది. ఆదివారం తన పాప పుట్టినరోజు సందర్భంగా రామలింగేశ్వర స్వామి గుట్టకు దర్శనానికి వెళ్ళింది. అక్కడ గుండంలో కాళ్లుకడుగుతుండగా లాస్య జారిపడింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.