News March 27, 2024
HYD: అధికారులకు విధులు కేటాయింపు: రోనాల్డ్ రోస్

పోలింగ్ అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశించారు. ఉద్యోగులు, సిబ్బంది మొదటి దశ రాండమైజేషన్ ప్రక్రియను మంగళవారం తన కార్యాలయంలో చేపట్టారు. జిల్లా పరిధిలోని 2 MP నియోజకవర్గాల పరిధిలో 3986 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. సిబ్బందికి ఏప్రిల్ 1,2 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో శిక్షణ ఇవ్వాలని, పోస్టల్ బ్యాలెట్‌ను అందించి ఓటేసే ప్రక్రియపై అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News March 5, 2026
HYD: చదువుకొనే పిల్లలనూ వదలడం లేదు!

JNTUHలో ప్రైవేటు సంస్థల జోక్యం వివాదానికి దారితీసింది. స్టూడెంట్స్‌కు క్రెడిట్ కార్డుల ఆశ చూపుతూ ECE డిపార్ట్‌మెంట్ వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ అనిత అనుమతితోనే తాము పెట్టామని సదరు సంస్థ ప్రతినిధులు తెలపడంపై విమర్శలొస్తున్నాయి. చదువుకొనే వయసులో క్రెడిట్ కార్డులు ఇచ్చి వారిని అప్పుల ఊబిలోకి నెట్టడమేంటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై మీ కామెంట్?
News March 5, 2026
HYD: గ్రేట్ సర్.. మరణించినా ప్రాణాలు కాపాడారు!

తాను మరణించిన ఆరుగురికి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబాదాస్ ప్రాణం పోశారు. అమీన్‌పూర్ బృందావన్ టీచర్స్ కాలనీలో ఉంటున్న అంబాదాస్(63) అధిక రక్తపోటుతో బాధ పడేవారు. ఫిబ్రవరి 28న ఒక్కసారిగా కుప్పకూలగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మార్చి 3న బ్రెయిన్ డెడ్ కావడంతో ఆర్గాన్స్‌ను డొనేట్ చేసేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారు. కుటుంబ నిర్ణయం స్ఫూర్తిదాయకం అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
News March 5, 2026
HYD: నేటి నుంచి 1Oth హాల్ టికెట్స్

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్ <


