News April 10, 2025
ములుగు: UPDATE.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని హత్య

ములుగు జిల్లా వాజేడు మండలంలో <<16046948>>దారుణ హత్య జరిగిన విషయం<<>> తెలిసిందే. సీఐ కుమార్ తెలిపిన వివరాలు.. టేకులగూడెంకు చెందిన బుల్లబ్బాయి మద్యానికి డబ్బు ఇవ్వాలని తన అన్న విజయబాబును అడిగాడు. తన వద్ద లేవని చెప్పడంతో కోపంతో పదునైన ఆయుధంతో ముఖంపై దాడి చేసి హత మార్చాడు. విజయబాబు చిన్న తమ్ముడు రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
Similar News
News November 9, 2025
జన్నారం: గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

జన్నారం మండలం బాదంపల్లి శివారులోని గోదావరిలో గల్లంతైన యువకుడు గుండా శ్రావణ్ మృతి చెందారు. శనివారం బాదంపల్లి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ఫోటో దిగుతూ ప్రమాదవశాత్తు ఆయన గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం బాదంపల్లి శివారులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు. శ్రావణ్ మృతితో ఆయన కుటుంబంతో పాటు పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.
News November 9, 2025
కాగజ్‌నగర్: పేదలకు అందని కంటి వైద్యం

కాగజ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో కంటి వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వం కంటి పరీక్షల కోసం సుమారు రూ.5 లక్షల విలువైన కంటి పరీక్ష యంత్రం (ఆప్టోమె ట్రిస్ట్) ఏర్పాటు చేసి వైద్యుడిని నియమించింది. 3 నెలల నుంచి యంత్రం మరమ్మతులో ఉంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కంటివైద్యం అందని ద్రాక్షగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
News November 9, 2025
కామారెడ్డి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి పూట విపరీతమైన చలి ఉండటంతో ప్రజలు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు పొగ మంచు వల్ల వాహనాలను నడపలేక పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటి నుంచే చలి మంటలు కాచుకుంటున్నారు.


