News April 10, 2025
ఖమ్మం: పోలీసు జాగిలం యామి మృతి

పోలీస్ శాఖలో 9 ఏళ్లుగా విశేష సేవలందించిన పోలీసు జాగిలం యామి (ఫిమేల్ డాగ్) అనారోగ్యంతో మృతి చెందింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛాలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. యామి (జాగిలం) లబ్రాడార్ రిట్రీవర్ సంతతికి చెందింది.
Similar News
News January 14, 2026
నారావారిపల్లెలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పోలీసులు ఏమన్నారంటే .!

నారావారిపల్లె సీఎం చంద్రబాబు ఇంటికి సమీపంలో జరిగిన ఘటనపై తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఫ్యాక్ట్ చెక్ చెప్పింది. పెద్దపంజాణి మండలానికి చెందిన గోవిందరెడ్డి తన సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చారని తెలిపారు. అతనిని పోలీసులు అనుమతించకపోవడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన వార్తలో వాస్తవం లేదన్నారు. గోవిందరెడ్డి క్యూలైన్లోకి రాకుండా వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు.
News January 14, 2026
ఇంట్రెస్టింగ్ మ్యాచ్.. ఎవరు గెలుస్తారో?

భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 28 ఓవర్లలో 134/2 రన్స్ చేసింది. మిచెల్, యంగ్ హాఫ్ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్ విజయానికి మరో 132 బంతుల్లో 151 రన్స్ అవసరం. ప్రసిద్ధ్, హర్షిత్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News January 14, 2026
కామారెడ్డి: గాలిపటం ఎగరేసిన ఎస్పీ

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర గాలిపటం ఎగరవేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో సంబరాలు నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భోగిమంటలు నిర్వహించారు. అనంతరం కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజేశ్ చంద్ర గాలిపటం ఎగరవేసి ఆకర్షణగా నిలిచారు.


