News April 10, 2025
స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

TG: ఈ నెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించింది.
Similar News
News March 22, 2026
నేడు సిద్దిపేట పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో జరుగుతున్న ‘రైతు ఉత్సవాలు’ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా సుమారు ₹300 కోట్లతో నిర్మించిన TG ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్రంలోనే మొదటి ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారు. ఇదే వేదికగా రైతు భరోసా మొదటి విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.
News March 22, 2026
అల్లు అర్జున్-అట్లీ మూవీలో అనుష్క శర్మ?

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీ కాస్టింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో ఇప్పటికే దీపికా పదుకొణె, రష్మిక, మృణాల్, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఈ సినిమాతో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. ఈ మూవీ టీజర్ ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.
News March 22, 2026
F-16 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చిందా?

ఇరాన్ ఎయిర్‌స్పేస్‌లో జరిగిన ఆపరేషన్‌లో తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇజ్రాయెల్‌కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాయని IRGC ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ ఈ వాదనను కొట్టిపారేసింది. తమ విమానంపై క్షిపణి దాడి జరిగిన మాట వాస్తవమేనని, కానీ పైలట్లు సేఫ్‌గా మిషన్‌ను పూర్తి చేసి తిరిగి వచ్చారని స్పష్టం చేసింది. విమానానికి ఎలాంటి డ్యామేజ్ కాలేదని పేర్కొంది.


