News April 10, 2025
ఆసిఫాబాద్‌లో కొత్త తరహాలో పశువుల రవాణా

ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త తరహాలో మూగజీవాలను కబేళాలకు తరలిస్తూ లక్షల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాలను పోలీసులు పట్టుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కొత్త తరహాలో ఎవరికి అనుమానం రాకుండా ఒక వాహనంలో 2 పశువులను తరలిస్తే ఎవరికి అనుమానం రాదనే ఆలోచనతో తరలిస్తున్నారు. సోమవారం కాగజ్‌నగర్లో 13వాహనాల్లో 26 పశువులను పట్టుకున్నారు.
Similar News
News July 6, 2025
రేపటి నుంచి 8 గంటల ముందే..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రిజర్వేషన్ ఛార్టుల ప్రిపరేషన్‌లో కొత్త విధానం జులై 7 నుంచి అమలు కానుంది. ఇప్పటివరకు రైలు బయల్దేరడానికి 4 గంటల ముందే ఛార్జ్ ప్రిపేర్ అవుతుండగా, రేపటి నుంచి 8 గంటల ముందే ఛార్ట్ ప్రిపేర్ కానుంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు బయల్దేరే రైళ్ల ఛార్టులను ముందురోజు రాత్రి 9 గంటలకల్లా వెల్లడిస్తారు. దీనివల్ల బెర్త్ దొరకనివారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు.
News July 6, 2025
31 మంది మందుబాబులకు జైలు శిక్ష: వరంగల్ CP

మద్యం తాగి వాహనం నడపిన 31 మందికి జైలు శిక్ష విధించినట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగా, పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతోందన్నారు. అలాంటి ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డ సందర్భాలూ ఉన్నాయన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News July 6, 2025
నిరాశ పరిచిన జూన్.. రైతన్నను వెంటాడుతున్న కష్టాలు

నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించాయని.. మంచి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలపడంతో రైతులు సంతోషించారు. జిల్లాలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో వ్యవసాయం మందగించిపోతుంది. వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా మోస్తరు వర్షాలే తప్ప.. భారీ వర్షం జాడ కానరావడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.