News April 10, 2025

హత్యా రాజకీయాలు ఇంకెంతకాలం పిన్నెల్లి..?: జూలకంటి

image

మాచర్ల నియోజకవర్గంలో ఇంకెంతకాలం హత్యా రాజకీయాలు చేస్తావు పిన్నెల్లి అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వెల్దుర్తిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మాచర్ల మండలం పశువేములలో పిల్లనిచ్చిన మామ అల్లుడికి మధ్య వివాదం నేపథ్యంలో జరిగిన హత్యను రాజకీయం చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన రౌడీకి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు.

Similar News

News March 11, 2026

వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణ మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణ క్రతువును జరిపించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. భక్తులు స్వామివారి కళ్యాణం కనులారా వీక్షించి తరించారు.

News March 11, 2026

మెదక్: LOVER❤️ బెదిరింపుతో సూసైడ్

image

అల్లాదుర్గం(M)అప్పాజీపల్లికి చెందిన రూప(21) ప్రియుడి బెదిరింపులతో ఆత్మహత్య చేసుకుంది. HYDలో పనిచేస్తున్న రూపకు మరో యువకుడితో వారం క్రితం నిశ్చితార్థం జరగడంతో, ప్రియుడు ఆమెకు ఫోన్‌ చేసి తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటే అంతు చూస్తానని బెదిరించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురై రూప సోమవారం చెరువులో దూకగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 11, 2026

అంగీకారంతో జరిగితే దాన్ని రేప్ అనలేం: కర్ణాటక హైకోర్టు

image

అంగీకారంతో కొన్నేళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉండి ఆపై పెళ్లికి నిరాకరిస్తే రేప్‌గా పరిగణించలేమని కర్ణాటక HC స్పష్టం చేసింది. ‘‘చట్టం ప్రకారం ‘హార్ట్‌బ్రేక్’ నేరం కాదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పైగా విదేశాల్లో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే అది మోసం కిందకు రాదంటూ నిందితుడిపై కేసును కొట్టివేసింది. కేవలం పెళ్లి చేసుకోలేదన్న కారణంతో అంగీకారంతో కూడిన బంధాన్ని రేప్‌గా మార్చలేమని కోర్టు తేల్చిచెప్పింది.