News April 10, 2025
గుంటూరు: మణిపురం బ్రిడ్జి వద్ద మహిళపై దాడి

ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో వ్యభిచారానికి పాల్పడుతున్న నెల్లూరు మహిళపై మంగళవారం అర్ధరాత్రి దాడి జరిగింది. బేరం మాట్లాడుకున్న ఓ వ్యక్తి ఆమెను మణిపురం బ్రిడ్జి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లగా, అక్కడ అప్పటికే ముగ్గురు వ్యక్తులు వేచి ఉన్నారు. నలుగురు కలిసి ఆమెపై దాడి చేసి, రూ.1000 నగదు లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు.
Similar News
News March 22, 2026
గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే!

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 320, విత్ స్కిన్ రూ. 300కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 960 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ. 430, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 230. చికెన్ ధరలు పెరగడంతో చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి..
News March 22, 2026
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన పడొద్దు: గుంటూరు JC

గుంటూరు జిల్లాలో గృహ అవసర గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ భరోసా ఇచ్చారు. గుంటూరు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎల్.పి.జీ ఏజెన్సీను శనివారం జేసీ తనిఖీ చేశారు. ఏజెన్సీలో ఉన్న కనెక్షన్లు, బుకింగ్ చేసినవి, అందుబాటులో ఉన్న సిలిండర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడి బుక్ చేసిన వివరాలు అడిగి తెలుసున్నారు.