News April 10, 2025

3 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

AP: తిరుమలలో నేటి నుంచి 12వ తేదీ వరకూ శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సాలకట్ల వసంతోత్సవాలు ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ముగిసేటట్లుగా నిర్వహిస్తారు.

Similar News

News March 28, 2026

యుద్ధంలోకి యెమెన్ హౌతీలు.. ఇజ్రాయెల్‌పై మిస్సైల్ దాడి

image

ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు పశ్చిమాసియా యుద్ధంలోకి దిగారు. ఇవాళ యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌పైకి బాలిస్టిక్ మిస్సైల్‌ను లాంచ్ చేశారు. దాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఎవరికీ గాయాలు కాలేదంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీల మొదటి దాడి ఇదే. కాగా ఇరాన్‌కు వ్యతిరేకంగా US, ఇజ్రాయెల్‌ యుద్ధంలోకి ఎవరైనా వస్తే తామూ రణరంగంలోకి దిగుతామని హౌతీలు నిన్న ప్రకటించారు.

News March 28, 2026

రాత్రి ఫోన్ చేసి ఇన్నర్‌వేర్‌పై ప్రొఫెసర్ ప్రశ్నలు!

image

చెన్నైలోని అన్నా వర్సిటీ ప్రొఫెసర్ జ్ఞానవేల్‌పై ఒక విద్యార్థిని సంచలన ఫిర్యాదు చేశారు. ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని దగ్గరై తనను వేధించాడని బాధితురాలు ఆరోపించారు. రాత్రి వేళల్లో ఫోన్ చేసి ఇన్నర్‌వేర్, పీరియడ్స్, పెళ్లి వంటి పర్సనల్ విషయాలపై అసభ్యంగా మాట్లాడుతూ టార్చర్ పెట్టేవాడని తెలిపారు. నంబర్ బ్లాక్ చేసినా ఇతర మార్గాల్లో వేధించాడని పేర్కొన్నారు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

News March 28, 2026

వారిని అన్‌ఫాలో చేసిన రిషబ్.. శాండల్‌వుడ్‌లో కలకలం

image

‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి వ్యవహారం శాండల్‌వుడ్‌లో చర్చనీయాంశమవుతోంది. డైరెక్టర్, నటుడు రాజ్ బీ శెట్టి, హీరోయిన్ రుక్మిణీ వసంత్, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ను ఆయన ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం కలకలం రేపింది. వారితో విభేదాలతోనే ఇలా చేశారని టాక్ నడుస్తోంది. దీనిపై ఎవరూ స్పందించలేదు. రాజ్‌తో కల్ట్ క్లాసిక్ ‘గరుడ గమన వృషభ వాహన’, రుక్మిణీతో కాంతార: చాప్టర్1 చిత్రాల్లో రిషబ్ నటించారు.