News April 10, 2025
పిటిషన్లపై సత్వర చర్యలకు కృషి: KMR SP

సమస్యలపై పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు ఇస్తున్న సందర్భంలో పూర్తి చిరునామా, మొబైల్ నంబర్‌ను స్పష్టంగా పేర్కొనాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుల పట్ల పారదర్శకత, వేగవంతమైన స్పందన, ప్రజలతో సమర్థమైన సమాచార పంపిణీ కోసం ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజల సహకారంతో పోలీసు శాఖ మరింత సమర్థంగా సేవలందించగలదని వెల్లడించారు.
Similar News
News July 9, 2025
2025 ఫస్టాఫ్ టాప్-10 మూవీస్ ఇవే!

2025 ఫస్టాఫ్ టాప్-10 మూవీస్ జాబితాను IMDb విడుదల చేసింది. ఇందులో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ మూవీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. రెండు, మూడు స్థానాల్లో డ్రాగన్, దేవా సినిమాలు నిలిచాయి. ఆ తర్వాత రైడ్ 2, రెట్రో, ద డిప్లొమాట్, ఎంపురన్, సితారే జమీన్ పర్, కేసరి చాప్టర్ 2, విదాముయర్చి చిత్రాలు ఉన్నాయి. కాగా టాలీవుడ్ నుంచి ఒక్క మూవీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.
News July 9, 2025
భద్రాద్రి: చెరువులో సింగరేణి ఉద్యోగి గల్లంతు

సరదాగా గడుపుదామని బయటకు వెళ్లిన మిత్రబృందంలో ఒకరు గల్లంతైన ఘటన మణుగూరు(M) రేగులగండి చెరువులో బుధవారం చోటుచేసుకుంది. సింగరేణిలో EP ఆపరేటర్‌గా పని చేస్తున్న మంచిర్యాల(D) శ్రీరాంపూర్‌కు చెందిన సుంకరి శ్రీనివాస్ సహోద్యుగులతో కలిసి చెరువు వద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత చెరువులో సరదాగా ఈత కొడుతుండగా అకస్మాత్తుగా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది.
News July 9, 2025
జనగామ: కష్టపడి ఈ స్థాయికి వచ్చా: డీఈఓ

కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని జనగామ డీఈఓ భోజన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాడు సౌకర్యాలు లేకున్నా కష్టపడి చదివానని, నేడు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.