News March 27, 2024
కావలిలో దారుణం ..హత్య చేసి.. ఇంటి వద్దే పూడ్చి..

కావలి రూరల్ మండలం పెద్దరాముడుపాళెంలో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 19న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పని ఉందని కాటంగారి చిన్నగోపాల్(27)ను తీసుకెళ్లాడు. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాలు, కుటుంబ సభ్యుల వద్ద ఆరాతీశారు. గోపాల్‌ను తీసుకెళ్లిన వ్యక్తి తన ఇంటి వెనకే పూడ్చినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కావలి రూరల్ సీఐ శ్రీనివాస గౌడ్ విచారణ చేపట్టారు.
Similar News
News March 28, 2026
నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ బస్సులపై మెరుపు దాడులు

నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై పోలీస్, రవాణా శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాలతో వాహనాల ఫిట్‌నెస్, డ్రైవర్ లైసెన్సులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, భద్రతా ప్రమాణాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రయాణికులు ఏవైనా ఫిర్యాదులు ఉంటే వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
News March 28, 2026
నెల్లూరు కేబినెట్ రేసులో కొత్త పేర్లు

నెల్లూరు జిల్లాలో త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కొత్త ముఖాలకు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. మంత్రులుగా ఉన్న నారాయణ లేదా ఆనం రామనారాయణ రెడ్డిలలో ఒకరిని మారుస్తారనే ప్రచారం సాగుతోంది. వారి స్థానంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మహిళా కోటా లేదా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన పనితీరు, దూకుడును బట్టి మంత్రి పదవి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
News March 28, 2026
నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు

జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సీఎం 30న నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల పంపిణీలో పాల్గొంటారని అన్నారు. ఒకటో తేదీన ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరులో పెన్షన్ల పంపిణీకి వస్తారని వివరించారు. రెండు పర్యటనలు విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని వెల్లడించారు.


