News April 10, 2025

నర్సీపట్నం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

గుల్లిపాడు- నర్సీపట్నం స్టేషన్ మధ్య ట్రైన్ నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 45 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రెండు రోజుల క్రితమే జారిపడి మృతి చెంది ఉంటాడని ఎస్ఐ తెలిపారు. మృతుడు ఎవరు అనేది తెలియరాలేదని, మృతుడు ఎడమ చేయిపై జ్యోతి అనే పచ్చబొట్టు ఉందని ఎస్ఐ వివరించారు.

Similar News

News March 22, 2026

కాంగ్రెస్ బడ్జెట్‌పై పెద్దపల్లి బీఆర్‌ఎస్ నేతల ఘాటు విమర్శలు

image

PDPL ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధుకర్ తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ అంకెల గారడీగా మారిందని, 6 గ్యారెంటీలకు నిధులు కోతపెట్టి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. వ్యవసాయం, సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం చూపారన్నారు. KCRహయాంలో అభివృద్ధి చెందిన తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలోకి నెట్టిందని విమర్శించారు.

News March 22, 2026

రేపు PGRS రద్దు: కలెక్టర్

image

కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ షామ్మోహన్ ప్రకటించారు. ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జిల్లా సమీక్షా సమావేశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో https://www.google.com/search?q=Meekosam.com నమోదు చేసుకోవాలని, పరిష్కార స్థితి కోసం 1100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

News March 22, 2026

ట్రంప్ అల్టిమేటమ్.. వెనక్కి తగ్గిన ఇరాన్

image

అమెరికా అధ్యక్షుడు <<19445494>>ట్రంప్<<>> 48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్‌ విషయంలో వెనక్కి తగ్గింది. జలసంధి మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని కండీషన్ పెట్టింది. ఆయిల్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం. అయితే ఇరాన్ హార్ముజ్‌ను పూర్తిగా ఓపెన్ చేసేందుకు అంగీకరించకపోవడంతో గడువు పూర్తయ్యాక ట్రంప్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది.