News April 10, 2025

ఇస్రో యువికా ప్రోగ్రామ్‌లో గుంటూరు జిల్లాకు గౌరవం 

image

ఇస్రో నిర్వహిస్తున్న యువికా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌లో గుంటూరు జిల్లా నుంచి వట్టిచెరుకూరు (మ) ముట్లూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి పవన్ దుర్గ, ఓ ప్రవేట్ స్కూల్ విద్యార్థి వి. సోమశేఖర్ ఎంపికయ్యారు. మూడున్నర లక్షల మందికిపైగా పోటీలో పాల్గొనగా ఈ ఇద్దరు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ బుధవారం అభినందించారు. మే 18 నుంచి 31 వరకూ శ్రీహరికోటలో జరిగే శిక్షణలో వీరు పాల్గొంటారు.

Similar News

News January 12, 2026

GNT: సెలవుల్లో ఊరెళ్లే వారికి SP సూచన

image

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS)ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఉచితంగా అందించే ఈ సేవల ద్వారా ఇళ్ల ముందు తమ సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపడతారని చెప్పారు. ప్రజలు ఊర్ల నుంచి వచ్చే వరకు గస్తీ నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయని పేర్కొన్నారు.

News January 12, 2026

తెనాలి సబ్ కలెక్టర్‌కు పదోన్నతి.. బదిలీ..!

image

తెనాలి సబ్ కలెక్టర్ V.సంజనా సింహ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సంజన సింహ పల్నాడు జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొంది తెనాలి నుంచి బదిలీ అయ్యారు. ఐతే తెనాలి సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజన్ అధికారిగా ఎవరిని నియమిస్తారన్నది తెలియాల్సి ఉంది.

News January 12, 2026

గుంటూరు GMC కమిషనర్ బదిలీ.. కొత్త కమిషనర్ ఈయనే!

image

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే క్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీనివాసులు స్థానంలో కె.మయూర్ అశోక్ గుంటూరు కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు మయూర్ అశోక్ విశాఖ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు.