News April 10, 2025

గుంటూరు: అలర్ట్.. ఏప్రిల్ 30 వరకే గడువు 

image

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డు ఉన్నవారు ఈనెల 30లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. రేషన్ డీలర్ లేదా ఎండీయూ వాహనం వద్ద పోస్ మెషిన్‌లో మీ వివరాలు తెలుసుకోవచ్చు. ఎర్ర రంగులో పేరు ఉంటే ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉన్నట్లు. వెంటనే వేలిముద్ర వేసి పూర్తిచేయండి. ఐదేళ్లలోపు, 80ఏళ్లు పైబడిన వారికి ఇది వర్తించదు. గడువులోగా పూర్తిచేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం epds1 వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు. 

Similar News

News March 18, 2026

తుళ్లూరులో పిడుగు పడి వ్యక్తి మృతి

image

తుళ్లూరులోని మేరీమాత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో పిడుగు పడి విద్యార్థి తండ్రి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పాఠశాల నుంచి 2వ తరగతి చదువుతున్న కుమార్తెను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళ్లిన శ్రీనివాస్ పిడుగు పడటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మృతుడు స్వగ్రామం రాజమండ్రి కాగా BSR కంపెనీలో సర్వేయర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2026

GNT: టెన్త్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

image

వట్టిచెరుకూరు బీసీ హాస్టల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి రాకేశ్ ఆత్మహత్య ఘటనపై మంత్రి సవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి ఆమె సానుభూతి తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఒత్తిడికి గురికాకుండా చూడాలని హాస్టల్ యాజమాన్యానికి సూచించారు. మార్కులే జీవితంలో ముఖ్యం కాదని చెప్పారు.

News March 18, 2026

GNT: సీఎం భద్రతా సిబ్బందికి పతకాలు

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని CM చంద్రబాబు వ్యక్తిగత భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలకు ఎంపిక చేసింది. CM ప్రత్యేక రక్షణ అధికారి మధుసూదన్‌కు ‘మహోన్నత సేవా పతకం’, కాన్వాయ్ డ్రైవర్ గిరిబాబుకు ‘ఉత్తమ సేవా పతకం’ ప్రకటించింది. 2019 నుంచి మధుసూదన్ CM వద్ద సేవలు అందిస్తుండగా, గిరిబాబు గత 15ఏళ్లుగా చంద్రబాబు కాన్వాయ్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.