News March 27, 2024

పగటి పూట ప్రయాణం చేస్తున్నారా? జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఆరుబయట పనిచేసేవారు, పగటి పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తలమడుగు, జైనథ్ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీలు రికార్డయ్యాయి.

Similar News

News January 24, 2026

రానున్న 24 గంటల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని, 2-3డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పింది. మరోవైపు నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్లూరి (D) జి.మాడుగులలో 6.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

News January 24, 2026

కోళ్లకు టీకా ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్లలో ప్రాణాంతక వ్యాధులను అధిగమించేందుకు కోడిపిల్లల స్థాయి నుంచే సమయానుగుణంగా టీకాలు వేయించాల్సి ఉంటుంది. అయితే ఈ టీకాలు కోళ్లకు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా మందులను ఎప్పుడూ ఐస్ లేదా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి ఉపయోగించాలి. కోళ్లకు ఇతర రోగాలు ఉన్నపుడు టీకాలు వేయకూడదు. కోళ్లు అస్వస్థతకు గురైనప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు టీకాలు వేయకూడదు. టీకాలను పగలు కంటే రాత్రివేళల్లో వేయడం మంచిది.

News January 24, 2026

అరుణోదయ స్నానం ఏ ఘడియలో చేయాలంటే?

image

2026లో మాఘ శుక్ల సప్తమి తిథి JAN 25న 12:39 AMకి, అదే రోజు 11:10 PMకి ముగుస్తుంది. సూర్యోదయ తిథిని అనుసరించి JAN 25, ఆదివారం రోజున రథసప్తమి పర్వదినాన్ని జరుపుకోవాలి. ఈ పవిత్రమైన రోజున అరుణోదయ స్నానం ఆచరించడానికి 5:26 AM – 7:13 AM అత్యంత శుభ సమయమని పండితులు చెబుతున్నారు. ఈ నిర్ణీత సమయంలో స్నానం చేసి సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల అనారోగ్యాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వారు సూచిస్తున్నారు.